వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఈ పర్యటన సన్నాహాల కోసం ఈ ఏడాది చివరిలో తాను భారత్‌కు రానున్నట్లు వైట్‌హౌస్ మీడియా సమావేశంలో తెలిపారు.
ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు ముగింపు దశకు వచ్చాయని, క్వాడ్ నేతల భేటీ కూడా త్వరలోనే జరగనుందని రూబియో పేర్కొన్నారు. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన భారత్‌ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దారని, మోదీ-ట్రంప్‌ల వ్యక్తిగత బంధం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసిందని వివరించారు.
Comments
Loading comments...

