వార్తలకు తిరిగి వెళ్లండి

హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భోగి’ క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో భారీ సెట్‌లో శర్వానంద్‌పై అత్యంత రిస్కీ, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. 1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆగస్టు 28న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Loading comments...

