Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రెండో వన్డేలో అఫ్గాన్‌పై ఘన విజయం భారత్‌దే సిరీస్‌

Rohit Singh Jun 18, 2026 5:02 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
రెండో వన్డేలో అఫ్గాన్‌పై ఘన విజయం భారత్‌దే సిరీస్‌ - Udayam Digital
అఫ్గానిస్థాన్‌తో లఖ్‌నవూలో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 402 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) శతకాలతో చెలరేగారు. అనంతరం 403 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్‌ను అర్ష్‌దీప్ సింగ్, గూర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో దెబ్బతీయడంతో ఆ జట్టు 232 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.

Comments

G
Loading comments...