Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఐదు సంస్థల ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

Rohit Agarwal Jun 06, 2026 5:27 AM అల్ ఇండియా 8 viewsabout 5 hours ago
ఐదు సంస్థల ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ - Udayam Digital
దేశీయ స్టాక్‌ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఓయో అనుబంధ సంస్థ ప్రిస్మ్‌, తృహోమ్‌ ఫైనాన్స్‌, వీగాలాండ్‌ డెవలపర్స్‌, అడ్వాంటా ఎంటర్‌ప్రైజెస్‌ మరియు మెహతా హైటెక్‌తో కలిపి మొత్తం ఐదు సంస్థల ఐపీవోలకు సెబీ అనుమతినిచ్చింది. ఈ కంపెనీలు సుమారు రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా, సీఎమ్మార్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 127 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు దాఖలవ్వడం గమనార్హం. త్వరలో మరిన్ని సంస్థలు మార్కెట్లోకి రానుండటంతో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...