Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సులో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
రాజిత దేవి Jul 11, 2026 12:48 PM జాతీయంGeneral
స్కూల్ బస్సులో అగ్నిప్రమాదం - Udayam
ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్‌లో శనివారం ఉదయం ఒక స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయం 9:26 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు ఫైర్ టెండర్లతో తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది రెండు వైపుల నుండి శ్రమించి 15-20 నిమిషాల్లో మంటలను పూర్తిగా అదుపు చేయడంతో, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముప్పు తప్పింది.

Comments

G
Loading comments...