వార్తలకు తిరిగి వెళ్లండి
పుస్తకాలతోనే వ్యక్తిత్వ వికాసం: అమిత్ షా

ఢిల్లీలో ఎన్‌డీఎంసీ ఏర్పాటు చేసిన జయప్రకాశ్ నారాయణ్ పబ్లిక్ లైబ్రరీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. దేశ ప్రగతికి అవసరమైన జ్ఞానం, వివేకం కేవలం గ్రంథాలయాల ద్వారానే లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
యువతరం తమ జీవితంలో ఒక్కసారైనా గ్రంథాలయాలతో అనుసంధానం కావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. పుస్తక పఠనం ద్వారా యువత తమ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చని, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావచ్చని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...