Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకావిష్కరణ: పాల్గొన్న జయప్రద, రఘురామ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 11, 2026 7:02 AM జాతీయంవినోదం
‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకావిష్కరణ: పాల్గొన్న జయప్రద, రఘురామ - Udayam
సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ ఆంగ్ల పుస్తకాన్ని ప్రముఖ నటి జయప్రద హైదరాబాద్‌లో ఆవిష్కరించి, తొలి ప్రతిని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు అందజేశారు. సావిత్రి గొప్పతనాన్ని నేటి తరానికి పరిచయం చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. తన తల్లి అరుదైన జ్ఞాపకాలను, ఫొటోలను భద్రపరిచేందుకే సంజయ్ కిశోర్‌తో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...