వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు APSRTC డిపో డ్రైవర్ అక్కెన శంకరరావు బుధవారం మృతి చెందారు. ఉదయం విధులకు వచ్చిన ఆయన విజయనగరం వెళ్లి తిరిగి వచ్చారు. విశ్రాంతి సమయంలో కుప్పకూలిపోవడంతో తోటి సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు సమాచారం ఇచ్చారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

