Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు - మక్కువ బైపాస్ పై భారీగా గుంతలు

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 8:42 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు - మక్కువ బైపాస్ పై భారీగా గుంతలు - Udayam
సాలూరు నుంచి మక్కువ వెళ్లే బైపాస్ రోడ్డు పెద్ద పెద్ద గోతులు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి గుండా నిత్యం ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డుపై గుంతల కారణంగా వర్షాల సమయంలో నీరు నిల్వ చేరి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని స్థానికలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...