వార్తలకు తిరిగి వెళ్లండి
జనగామలో ఆర్టీసీ బస్సు చోరీ
జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ అద్దె బస్సును ఓ వ్యక్తి మద్యం మత్తులో దొంగిలించాడు. పాలకుర్తికి చెందిన వెంకన్న అనే ఆ నిందితుడు బస్సును సూర్యాపేట వైపు 21 కిలోమీటర్లు నడిపాడు.
సింగరాజుపల్లి టోల్ గేట్ వద్ద బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...