వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం గంగరేగువలసలో తమ వీధికి వెళ్లే రహదారి వర్షం పడితే బురదమయంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోవడంతో మహిళలే శ్రమదానం చేపట్టారు.
సొంతంగా డబ్బులు సమకూర్చుకుని రాయి, బుగ్గి తెచ్చి రహదారిపై వేసి రాకపోకలకు అనుకూలంగా మార్చుకున్నారు. సమస్యను అధికారులకు పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదని వారు వాపోయారు.
Comments
Loading comments...

