వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలోని 9వ వార్డు పద్మనాయక ప్రక్కన వీధిలో రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి పక్కన చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు రాకపోకలకు కూడా ఇబ్బందిగా మారిందని స్థానికులు వాపోతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెత్తను తొలగించి, రహదారిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని 9వ వార్డు ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

