Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు కోసం కేక్ కటింగ్‌తో నిరసన

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:45 AM జగిత్యాలGeneral
రోడ్డు కోసం కేక్ కటింగ్‌తో నిరసన - Udayam
భీమారం మండలంలో మన్నెగూడెం నుంచి తక్కళ్లపల్లి వరకు తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు గురువారం వరుసగా రెండో నెల కేక్ కట్ చేసి వినూత్న నిరసన తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుట్ల వెళ్లేందుకు ఈ రహదారి కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. డిమాండ్ నెరవేరే వరకు ప్రతి నెల 29వ తేదీన కేక్ కటింగ్ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...