వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాల మండల కేంద్రం నుంచి కొత్తకుంటపల్లి, జీలుగుపల్లి, దత్తారం వెళ్లే రహదారులపై కల్వర్టులకు రక్షణ గోడలు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రమాదకరమైన మలుపులు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టులకు రక్షణ గోడలు నిర్మించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

