వార్తలకు తిరిగి వెళ్లండి

సోదర, సోదరీమణుల ప్రేమానురాగాల పండుగ రక్షాబంధన్ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర బంధం ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు.
ప్రేమ, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం తరపున కోరారు.
Comments
Loading comments...

