Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారి కోసం జరడ పంచాయతీ ప్రజల అర్ధనగ్న ప్రదర్శన

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 1:55 PM పార్వతీపురం మన్యంGeneral
రహదారి కోసం జరడ పంచాయతీ ప్రజల అర్ధనగ్న ప్రదర్శన - Udayam
కురుపాం మండలలో రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ జరాడ పంచాయతీ పరిధిలోని గిరిజనులు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. గెడ్డిగూడ, ములుగూడ, గుమ్మిడిగూడ, పట్టాయిగెడ్డ, కంబమానుగూడ గ్రామాల ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. పీవో, కలెక్టర్కు వినతులు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రహదారి మంజూరు చేయాలని, లేనిపక్షంలో స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...