వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో సర్ హియరింగ్ గ్రామసభను నిర్వహించనున్నారు. గ్రామంలోని పలువురికి అధికారులు ఇటీవల సర్ నోటీసులను జారీ చేశారు. అందులో భాగంగా సోమవారం పోన్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్ హియరింగ్ సభ ఉంటుందని అధికారులు తెలిపారు.
నోటీసులు అందుకున్న వారు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ధృపత్రాలలో ఏదో ఒకటి తీసుకువచ్చి అధికారులకు, బూత్ లెవెల్ అధికారులకు ఇవ్వాలని వారు సూచించారు.
Comments
Loading comments...

