వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ జూనియర్ బాలురు, బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, కార్యదర్శి సీహెచ్ కామేశ్వరి ఈ విషయాన్ని తెలిపారు.
ఉదయం 9 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 2009 జనవరి 1 తర్వాత జన్మించిన బాలురు, బాలికలు ఎంపికలకు అర్హులని తెలిపారు.
Comments
Loading comments...

