వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుంచి ముంబయికి నకిలీ కరెన్సీ తరలిస్తున్న రాజస్థాన్‌కు చెందిన శివరతన్ మహియాను అక్టోబర్ 31న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో అరెస్టు చేశారు.
నోట్లను ముంబయిలో అందజేస్తే రూ.2.20 లక్షలు ఇస్తానని ఓం ప్రకాశ్ ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఓం ప్రకాశ్ కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

