Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారు, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:58 PM మహబూబ్‌నగర్General
కారు, బైక్ ఢీకొని ఇద్దరు దుర్మరణం - Udayam
నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం చెన్నారం గేటు సమీపంలో ఆదివారం సాయంత్రం కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శ్రీశైలం–హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను చేగుంటకు చెందిన మహేష్, వెలుగొండకు చెందిన వంశీగా పోలీసులు గుర్తించారు. వీరు మేస్త్రీ పనులు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...