వార్తలకు తిరిగి వెళ్లండి

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కలయికలో వస్తున్న ‘ఇరుముడి’ చిత్రం నుండి సరికొత్త మ్యూజికల్ అప్‌డేట్ వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ అయ్యప్ప స్వామి నేపథ్యంలో సాగే రెండు కీలకమైన భక్తి పాటలను కంపోజ్ చేశారు.
ఈ సినిమాలో రవితేజ కూతురి కోసం అయ్యప్ప మాల ధరించే ఒక ఎమోషనల్ తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ భక్తిరస యాక్షన్ డ్రామాను ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Loading comments...

