వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ నుండి అకస్మాత్తుగా తప్పుకోవడంతో ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) ఆయనపై నాన్-కోఆపరేషన్ (నిషేధం) విధించింది. షూటింగ్‌కు కొద్దిరోజుల ముందే ఆయన తప్పుకోవడం వల్ల నిర్మాతలకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం.
ఈ వివాదంపై వివరణ ఇవ్వడానికి రణ్‌వీర్ నిరాకరించడంతో, ఫెడరేషన్ కార్మికులు ఎవరూ ఆయనతో కలిసి పనిచేయకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా, వృత్తిపరమైన చర్చలను గౌరవప్రదంగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే తాను మౌనంగా ఉన్నట్లు రణ్‌వీర్ సింగ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

