వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా విజయాన్ని కేవలం బాక్సాఫీస్ వసూళ్లతోనే కొలవడం సరైన పద్ధతి కాదని నటుడు రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా నంబర్ల చుట్టూనే తిరుగుతోందని, అయితే మంచి వసూళ్లు వస్తే మరిన్ని ప్రయోగాలు చేయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు.
తన కొత్త చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో చరణ్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కలెక్షన్లు సినిమాకు ఆర్థికంగా తోడ్పడతాయే తప్ప, అవే సినిమా పూర్తి విజయాన్ని నిర్ణయించలేవని ఆయన వివరించారు.
Comments
Loading comments...

