వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యోగాలుBreaking
రైల్వే జాబ్స్ నోటిఫికేషన్: 4,098 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 4,098 టెక్నికల్ సిబ్బంది నియామకానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. జూనియర్ ఇంజినీర్లు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్లు, కెమికల్ మరియు మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి 35 కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాల్లో అత్యధికంగా పర్మనెంట్ వే విభాగంలో 845, వర్క్స్‌లో 470, క్యారేజ్ & వాగన్‌లో 450 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) ఈ నెల 21 నుంచి అధికారిక నోటిఫికేషన్లను విడుదల చేయనున్నాయి.
Comments
Loading comments...