Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయిలో రాజాం ప్రథమ స్థానం

Follow Udayam on Google
B. Rajesh Sep 30, 2026 5:37 PM విజయనగరంGeneral
రాష్ట్రస్థాయిలో రాజాం ప్రథమ స్థానం - Udayam
స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర అవార్డులలో రాజాం మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం లభించినట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. 50 వేల లోపు జనాభా కేటగిరీలో రాజాం మున్సిపాలిటీకి ఈ అవార్డు దక్కింది. ఇప్పటికే పన్నుల వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకున్న రాజాం మున్సిపాలిటీ తాజాగా ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం.

Comments

G
Loading comments...