వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్ల మండలంలో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 జూన్ 30 వరకు చేపట్టిన ఉపాధి పనులపై గ్రామాల్లో సామాజిక తనిఖీ సభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎస్. వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సభలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు.
పనుల వివరాలను గ్రామసభల్లో ప్రజలు తెలియజేయాలని సూచించారు. ఈ నెల 24న ఎంపీడీవో కార్యాలయంలో జరిగే బహిరంగ ప్రజావేదికలో సమస్యలు, అభ్యంతరాలను వెల్లడించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

