Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్సులో కూలిన హెలికాప్టర్.. ఇద్దరు గల్లంతు

Follow Udayam on Google
Harika Oct 09, 2026 12:56 PM అంతర్జాతీయంGeneral
గ్వాటెమాలాలోని సోలోలా ప్రాంతంలో అటిట్లాన్ సరస్సులో హెలికాప్టర్ కూలిపోయింది. అక్టోబర్ 8న లా అరోరా విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్‌బస్ H130 హెలికాప్టర్.. భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా అదుపుతప్పి సరస్సులో పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉండగా, ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...