Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూరి బీచ్‌పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైకత శిల్పం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 19, 2026 6:32 PM సంగారెడ్డిGeneral
పూరి బీచ్‌పై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సైకత శిల్పం - Udayam
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 63వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పేరుతో ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. పూరి పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే శిల్పాన్ని వీక్షించి చెన్నారెడ్డిని అభినందించారు. అభిమానుల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...