Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పతకం అందుకుని టెకీ కన్నుమూత

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 6:22 AM జాతీయంక్రీడలు
పతకం అందుకుని టెకీ కన్నుమూత - Udayam
హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో పాల్గొన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కొమ్మినేని గోపి (36) మృతి చెందారు. పరుగు పూర్తిచేసి పతకం అందుకున్న అనంతరం అల్పాహారానికి వెళ్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిర్వాహకులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమికంగా గుండెపోటు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...