Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంటిలో చిరునవ్వే లక్ష్యం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
J.J. Krishna Oct 01, 2026 4:25 PM బాపట్లGeneral
ప్రతి ఇంటిలో చిరునవ్వే లక్ష్యం: ఎమ్మెల్యే - Udayam
చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో చిరునవ్వు చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...