Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపా రెడ్డి హత్యపై ప్రైవేట్‌ స్కూళ్ల నిరసన

Follow Udayam on Google
Harika Aug 21, 2026 4:15 PM మహబూబాబాద్ General
రూపా రెడ్డి హత్యపై ప్రైవేట్‌ స్కూళ్ల నిరసన - Udayam
నల్లగొండ జిల్లాలో ప్రైవేట్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ రూపా రెడ్డి హత్యను నిరసిస్తూ మహబూబాబాద్‌ పట్టణంలో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన చేపట్టాయి. ట్రస్మా ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన నిర్వహించారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. అలాగే, సిబ్బందికి భద్రత కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...