Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విరాళాల దొంగలను రక్షిస్తున్నారు : కేజ్రీవాల్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 12, 2026 2:00 PM జాతీయంGeneral
విరాళాల దొంగలను రక్షిస్తున్నారు : కేజ్రీవాల్  - Udayam
రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. దొంగలను ప్రధాని వదిలిపెట్టరని ప్రజలు ఆశించారని, కానీ ఇప్పుడు ఆ దొంగలను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. భూ కుంభకోణం, గుడి నిర్మాణంలో కమీషన్ల దందాపై ఎలాంటి విచారణ జరగలేదన్నారు. కానుకల చోరీపై నామమాత్రపు విచారణ చేసి, నకిలీ సిట్ వేసి, నకిలీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని మండిపడ్డారు. ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ప్రజల్లో పూర్తిగా పోయిందని కేజ్రీవాల్ ఆరోపించారు.

Comments

G
Loading comments...