Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని హామీనే అబద్ధం చేస్తున్న బీజేపీ: సీఎం ఒమర్ అబ్దుల్లా

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 12, 2026 2:28 PM జాతీయంGeneral
ప్రధాని హామీనే అబద్ధం చేస్తున్న బీజేపీ: సీఎం ఒమర్ అబ్దుల్లా - Udayam
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామన్న ప్రధాని మోదీ హామీని స్థానిక బీజేపీ నేతలు అబద్ధంగా మారుస్తున్నారని సీఎం ఒమర్ అబ్దుల్లా విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నేత సీఎం అయ్యేంతవరకూ హోదా ఇవ్వబోమని ప్రజలకు బహిరంగంగా చెప్పాలన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కేవలం బీజేపీ లబ్ధి కోసమే జరిగిందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీలను చీల్చినట్లే ఇక్కడా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో నేరుగా గెలిచి అధికారంలోకి రాలేని బీజేపీ.. ఆపరేషన్ కమలం పేరుతో వెనుక ద్వారం నుంచి దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడుతోందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...