వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ప్రోటీన్ ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలని జన్నారం మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ వాణి సూచించారు. జన్నారం మండలంలోని హాస్టల్ తండా అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు.
పిల్లల వయసుకు తగిన పోషకాహారం ఇవ్వాలని, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ వజ్ర, నీలా, జిజియ, గర్భిణీలు, చిన్నారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

