Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
Mohammad Aug 13, 2026 3:39 PM అనంతపురంవినోదం
ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
అనంతపురం రాంనగర్‌లో గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. అనంతరం అర్జీలను స్వయంగా స్వీకరించిన మంత్రి, అధికారులతో ఫోన్‌లో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...