వార్తలకు తిరిగి వెళ్లండి
యాక్షన్ సీన్స్‌పై పృథ్వీరాజ్ జాగ్రత్త

‘ఐ, నోబడీ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2023లో జరిగిన ఒక సినిమా షూటింగ్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా తన ఎడమ మోకాలికి తీవ్ర గాయమైందని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఈ గాయం కారణంగా మూడు సర్జరీలు జరిగాయని, ప్రస్తుతం కాలిలో మూడు టైటానియం స్క్రూలు ఉన్నాయని చెప్పారు. అప్పటి నుంచి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తాను ఎంతో జాగ్రత్తగా ఉంటున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు.
Comments
Loading comments...