వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో పర్యటించనున్నారు. మోల్డోవా, నార్త్ మాసిడోనియా దేశాలలో ఒక భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈ పర్యటన సెంట్రల్, ఈస్టర్న్ యూరప్ దేశాలతో భారతదేశానికి ఉన్న వ్యూహాత్మక సంబంధాలను, భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది.
Comments
Loading comments...

