వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో వంతెన లేక నిండు గర్భిణి నానా అవస్థలు పడింది. ఆసుపత్రికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జంపన్న వాగును నడుము లోతు నీటిలో దాటాల్సి వచ్చింది. వర్షాకాలంలో గ్రామస్థుల కష్టాలు వర్ణనాతీతం.
రూ. 25 కోట్లతో వంతెన ప్రతిపాదనలు పంపినా, అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటడం గ్రామస్థులకు పరిపాటిగా మారింది.
Comments
Loading comments...

