వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు 457.70 మీటర్లు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం 1.165 టీఎంసీల నీరు నిలువ ఉందన్నారు. ఇన్ ఫ్లో ఏమీ లేదని, ఔట్ ఫ్లో కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

