వార్తలకు తిరిగి వెళ్లండి

తొగుట మండలం బండారుపల్లిలోని మెట్టు ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన షూలు, టైలు, బెల్టులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

