వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’ విడుదల
ధీరజ్ రెడ్డి Jun 27, 2026 11:27 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

ప్రభాస్, హను రాఘవపూడి కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’ విడుదల తేదీ ఖరారైనట్లు సమాచారం. ఈ పీరియడ్ డ్రామాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
స్వాతంత్య్రానికి పూర్వం నాటి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారు. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...