Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం - ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 24, 2026 8:43 PM విజయనగరంGeneral
పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం - ఎస్పీ - Udayam
పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్‌ తెలిపారు. సోమవారం స్తానిక పోలీసు క్వార్టర్స్‌ ఆవరణలోని చిల్డ్రన్‌ పార్క్‌, గ్యాస్‌ గోడౌన్‌, కన్స్యూమర్‌ స్టోర్‌, గ్రోసరీ షాప్‌, పోలీసు టైలరింగ్‌ సెంటర్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పోలీసు సిబ్బందికి వారి కుటుంబాలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరిచేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని అదికారులకు సూచించారు.

Comments

G
Loading comments...