వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడులో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ, ఈ నెల 28న ఆదివారం 5 ఏళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, స్థానికులు మానవహారంగా ఏర్పడి పల్స్ పోలియోపై ప్రమాణం చేశారు. ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

