వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని ఆటో యూనియన్ అధ్యక్షుడు, సీపీఎం నాయకుడు మనోహర్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన సీఐటీయూ అనుబంధ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా ఎంతో కాలం సేవలందించారు.
మనోహర్ మృతి పట్ల సీపీఎం నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Comments
Loading comments...

