వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పంచముఖీ కాలనీ బురుజుగడ్డ మైసమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లతో ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

