Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొక్కలు నాటితే బంపర్ ఆఫర్లు

ధనుష్ రెడ్డి Jul 16, 2026 10:25 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
మొక్కలు నాటితే బంపర్ ఆఫర్లు - Udayam Digital
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రత్నపార్ఖీ సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. కేవలం రూ.51 కే ఇంటి వద్ద మొక్కలు నాటడంతో పాటు జియో-ట్యాగింగ్ ద్వారా వాటి ఎదుగుదలను ఆన్‌లైన్‌లో నిరంతరం పర్యవేక్షిస్తారు. మొక్కలను విజయవంతంగా పెంచే కుటుంబాలకు వైద్య పరీక్షలు, హోటల్ బిల్లులు, షాపింగ్‌లపై భారీ డిస్కౌంట్ కార్డులు అందజేస్తారు. అయితే, మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే ఈ రాయితీ కార్డులు వెంటనే రద్దవుతాయి.

Comments

G
Loading comments...