వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పెంపుడు జంతువులు, పక్షుల విక్రయ కేంద్రాలు, డాగ్ బ్రీడింగ్ సెంటర్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 13లోగా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిబంధనలు పాటించని, సరైన వసతి కల్పించని కేంద్రాలపై జంతువుల క్రూరత్వ నివారణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దరఖాస్తు వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
Comments
Loading comments...

