వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో సరదాగా గడుపుతున్న సమయంలో రాకాసి అలలు రావడంతో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

