Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అన్ని జిల్లాల్లోనూ పాతాళానికి భూగర్భ జలాలు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 7:20 AM హైదరాబాద్General
అన్ని జిల్లాల్లోనూ పాతాళానికి భూగర్భ జలాలు - Udayam
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే సగటున 3.11 మీటర్ల లోతుకు నీటిమట్టాలు క్షీణించినట్లు భూగర్భ జలశాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 68% మండలాల్లో దశాబ్దపు సగటు కంటే నీటిమట్టాలు తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. తాగు, సాగునీటి భద్రతపై రానున్న కాలంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...