వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని లూథర్‌గిరి కాలనీలో సెప్టెంబర్ 30న జరిగిన 80 గ్రాముల బంగారం చోరీ కేసులో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాణి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది.
దర్యాప్తులో వేలిముద్రల ఆధారంగా నిందితురాలిని గుర్తించిన పోలీసులు, ఆమె వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ అనంతరం తగిన చర్యలు చేపట్టనున్నట్లు CI నారాయణస్వామి తెలిపారు.
Comments
Loading comments...

